హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలు, బీసీ నేతలపై కుల దురహంకారాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నదని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ నిప్పులు చెరిగారు.
బీసీ మహిళకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బోర్డు మెంబర్‌గా పదవి వస్తే ఓర్వలేకపోతున్నారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జకిడి శివచరణ్‌రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.