Congress | కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 2: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు స్టేజిపైనే కొట్టుకున్నారు. పరస్పరం కుర్చీలు విసురుకుంటూ ఘర్షణ పడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్‌లో నిర్వహించిన కుల గణన సమావేశంలో ఈ ఘర్షణ తలెత్తింది. సమాచారం లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌రావును నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, అతని వర్గీయులు నిలదీయడంతో గొడవకు దారితీసింది. స్టేజీపైనే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ.. కొ ట్టుకున్నారు.
ఈ దాడిలో కార్యకర్త గడ్డల సత్తయ్యకు గాయాలయ్యాయి. రోడ్డుపై శ్యాంనాయక్, అతని వర్గీయులు ధర్నా చేశారు. తమ పై దాడికి పాల్పడిన అనిల్గౌడ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ డీఎ స్పీ రామానుజం కల్పించుకొని శ్యాంనాయక్ వర్గీయులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసులు బలవంతంగా శ్యాం నాయక్‌తోపాటు అతని అనుచరులను అరెస్ట్‌చేశారు. సీఐలు బుద్ధస్వా మి, రవీందంర్, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఎస్సైలు రాజేశ్వర్, చంద్రశేఖర్, సిబ్బం ది పహారా మధ్య కాంగ్రెస్ పార్టీ సమాశం కొనసాగింది. కాగా.. కొంతకాలంగా విశ్వప్రసాద్‌రావు, శ్యాంనాయక్ వర్గాల మధ్య అంతర్గత పోరు జరుగుతున్న విషయం తెలిసిందే.