BRS Party | యాదాద్రి భువనగిరి : ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ యువజన విభాగానికి బిగ్ షాక్ తగిలింది. మోటకొండూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు చామల ఉదయ్ చందర్ రెడ్డి.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. చాడ గ్రామానికి చెందిన మోకు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కూరేళ్ల నరేశ్ గౌడ్‌తో పాటు జిల్లాకు చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు కారెక్కారు. వీరందరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలు ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు కృషి చేస్తామని ఉదయ్ చందర్, కూరేళ్ల నరేశ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కనివ్వమని తేల్చిచెప్పారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.