హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress )లో రోజుకో రీతిలో కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతా బాగానే ఉందని పెద్దలు పైకి గొప్పలు చెప్పుకుంటుంటే..క్షేత్రస్థాయిలో మాత్రం శ్రేణులు తలలు పగిలేలా తన్నుకుంటున్నారు. శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి(thungathurthi) నియోజకవర్గంలోని చౌళ్ల రామారం గ్రామంలో ప్రచారం చేస్తుండగా కార్యకర్తలు పొట్టు పొట్టుగా(Hit) కొట్టుకున్నారు.
ప్రచారంలో భాంగంగా యువజన నాయకుడు ఖమ్మంపాటి కుమార్ గౌడ్‌ను గ్రామ కాంగ్రెస్ నాయకులు ప్రచార రథం నుంచి మెడలు పట్టి కిందకు నెట్టేసారు. బాధితుడు స్పృహ కోల్పోయాడు. దీంతో ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. చొక్కాలు పట్టుకుని తోసుకున్నారు. పార్టీ నేతలు చెప్పినా వినకుండా రచ్చ రచ్చ చేశారు.