పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 10 : నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తలపై మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను నాగర్‌కర్నూల్ జనరల్ దవాఖానకు తరలించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం గ్రామంలో దాయాదుల మధ్య ఉన్న భూ సమస్య నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనుచరులపై మంత్రి జూపల్లి వర్గీయులు దాడులు చేస్తున్నారని మాజీ సర్పంచ్ ఇందిర భర్త రవినాయక్ తెలిపారు. భూసమస్యపై సంబంధిత అధికారులకు బీఆర్ఎస్ కార్యకర్తలు విన్నవించినా.. జూపల్లి అనుచరులు దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.