అచ్చంపేట, మే 14: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పట్టణంలోని 89వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం జరిగిన చిన్నపాటి ఘర్షణపై సాయినగర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మం గళవారం రెండో వార్డు కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడి చేశారు. గది తలుపులను పగులగొట్టి దాదాపు 15 మంది ఇంట్లోకి చొరబడి అక్కడున్న వారిపై దాడికి తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా చితకబాదారు. కుర్చీలు, తలుపులను ధ్వంసం చేశారు. మహిళలు, పిల్లలు వద్దని వారించినా వినకుండా మహిళలపైనా దాడికి పాల్పడ్డారు.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను వారించినా కర్రలతో చితక్కొట్టారు. సుంకరి మహేశ్, సురేశ్, బాలకృష్ణ, లింగం, చరణ్‌పై దాడిచేయగా మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని అచ్చంపేట దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన రామయ్య, మం త్రా ల లాలుయాదవ్, మంత్రాల అంజి, జితేందర్, సాయిలు, తిరుపతయ్య, బన్ని, కొడెల మల్ల య్య, మంత్రాల శ్రీను, రామ్, లక్ష్మణ్, పుల్జాల మల్లేశ్, గుడ్ల రవి తదితరులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఆగడాలను అరికట్టాలని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ ఆధ్వర్యం లో బీఆర్ఎస్ శ్రేణులు బాలరాజు ఇంటి నుంచి ర్యాలీగా వెళ్లి పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కాం గ్రెస్ దాడిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్య ర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఖండించారు.