DK Shivakumar | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఐదు నెలల వ్యవధిలోనే కర్ణాటకను ఆగమాగం చేసిన కాంగ్రెస్ సర్కారు అబద్ధాలతో డర్టీ గేమ్ మొదలుపెట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్కడి ‘5 గ్యారెంటీ స్కీమ్’లపై అబద్ధాలు వల్లెవేశారు.
ఇచ్చిన హామీమేరకు అన్ని గ్యారంటీలను నెరవేర్చినట్టు అసత్యాలు ప్రవచించారు.