హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన, ఖైరతాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) దవాఖానలో చేరారు.
హనుమంతరావు గతంలోనూ కిడ్నీ సమస్యతో బాధపడుతూ దవాఖానలో చేరి చికిత్స అనంతరం కోలుకున్నారు.