Meenakshi Natarajan | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి కోర్టులోనే ఉందని కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారాయి. మొన్నటిదాకా క్యాబినెట్ విస్తరణ అంశం హైకమాండ్ చేతిలో ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తూ వచ్చారు.
పార్టీ కోసం కష్టపడ్డ నాయకులనే మంత్రిపదవి వరిస్తుందని.. ఆ నేతలు ఎవరో నిర్ణయించేది మాత్రం అధిష్ఠానమే అంటూ పదేపదే చెప్పారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. మంత్రి పదవి కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆశావహులు పెరిగిపోయారు. ఇప్పట్లో క్యాబినెట్ విస్తరణ కష్టమేనన్న సంకేతాలతో కొన్నాళ్లుగా వారంతా సైలెంట్ అయిపోయారు. కానీ మీనాక్షీనటరాజన్ చేసిన వ్యాఖ్యతో పార్టీలో మళ్లీ అలజడి మొదలైంది.