మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 3: భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలో చెరువులు తెగి అనేక గ్రామాలు నీట మునిగాయని, ఈ విపత్తు సమయంలో బాధితులకు సాయం అందించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ క్యాంప్ ఆఫీస్‌లో వారు మీడియాతో మాట్లాడారు.
అధికారులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజలను పరామర్శించకపోవడం దారుణమని పేర్కొన్నారు. వరద ముంపులో భారీగా నష్టపోయిన నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని సీఎం సందర్శించకుండా వెళ్లిపోయారని ఫైర్ అయ్యారు.