Congress Leader VH | నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు ఫైర్ అయ్యారు. తనను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. తనతో పెట్టుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తే.. ఆయనేం చేశాడో బయట పెడతా అని హెచ్చరించారు.
కోమటి రెడ్డి వెంకటరెడ్డికి రెండు టికెట్లు ఇస్తామని చెప్పారని వీహెచ్ అన్నారు. తానెప్పుడు ఉత్తమ్ కు వ్యతిరేకంగా పని చేయలేదన్నారు. అంబర్ పేట సీటు తనదేనన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మహేశ్వర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డిని బీజేపీలోకి, కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి పంపలేదా అని నిలదీశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తదో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బీసీలను ఓట్లేసే యంత్రాలుగా భావించొద్దని హెచ్చరించారు.