హైదరాబాద్, సెప్టెంబర్16(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘ఏ రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో.. ఆ రాష్ట్రం ఢిల్లీకి గులాంగిరి చెయ్యాల్సిం దే’.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిన కామెంట్ ఇది. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థల్లో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల్లో 70 శాతం, మేనేజ్మెంట్ పోస్టుల్లో 50 శాతం ఉద్యోగాలను కన్నడిగులకే కేటాయించాలంటూ కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకొన్న ఇటీవలి నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
విమర్శ లు వెల్లువెత్తడంతో రాహుల్ ఆదేశాల తో సిద్ధరామయ్య సర్కారు బిల్లును వెనక్కి తీసుకొన్నదని జాతీయ మీడి యా పలు కథనాల్లో వెల్లడించింది. అంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు ్వం ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్నా దానికి ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల అనుమతి తప్పనిసరి అన్న విషయం కర్ణాటక ఘ టనతో రుజువవుతున్నది.
తెలంగాణ బిడ్డల మేలు కోరి రాష్ట్రప్రభుత్వ సంస్థల్లో 95 శాతం కొలువు లు స్థానికులకే ఇవ్వాలంటూ అప్పటి కేసీఆర్ సర్కారు ఆదేశాలు జారీ చేసిం ది. వివాదాలు తలెత్తకుండా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలను ఏర్పా టు చేసింది. తర్వాత వచ్చిన రేవంత్ ప్రభుత్వం 19 జిల్లాలను రద్దు చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నది. ఇదే జరిగితే జోనల్ వ్యవస్థను మళ్లీ మార్చాల్సి వస్తుంది. కొత్త వ్యవ స్థ వచ్చే వరకూ నోటిఫికేషన్లు, నియామకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉం డబోవు.
ఇది ఒకవిధంగా తెలంగాణ ప్రజలకు నష్టాన్ని కలిగించేదే. ఇక, జిల్లాల రద్దుపై అంతిమ నిర్ణయాధికా రం రేవంత్ చేతిలో ఉంటుందా? అం టే, అదీలేదు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. అంటే ఒకవిధంగా రాష్ర్టానికి సంబంధించిన నిర్ణయాలూ ఢిల్లీ కేం ద్రంగా నడవాల్సిందేనన్న మాట. ‘తెలంగాణ స్థితిగతులపై ఏమాత్రం అవగాహనలేని ఢిల్లీ పెద్దలకు రాష్ర్టానికి సంబంధించిన కీలక విషయాల్లో నిర్ణయాధికారం ఇవ్వడమంటే ఇది ఒకరకమైన పరాయిపాలనే’నని అవుతుందని తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు.