BRS Party | కొల్లాపూర్ : కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాశ్ రావు బీఆర్ఎస్లో చేరారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశానని రంగినేని అభిలాశ్‌రావు అన్నారు. కానీ ఇటుక ఇటుక పేర్చిన పుట్టలోకి విషపు నాగులాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చి పార్టీలో చేరారని తెలిపారు. ఇలాంటి నాయకుల చేతుల్లోకి కొల్లాపూర్ వెళ్లకూడదని బీఆర్ఎస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు. వెనుకబడ్డ కొల్లాపూర్ నియోజకవర్గాన్ని తనదైన శైలితో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.