BRS Party | హైదరాబాద్ : అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పలువురు కాంగ్రెస్ నేతలు కారెక్కారు. అచ్చంపేట నియోజకవర్గం, చారగొండ మాజీ ఎంపీపీ, సర్పంచ్ గుండె నిర్మల, విజేందర్ గౌడ్ దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వీరు గులాబీ గూటికి చేరారు. విజేందర్ గౌడ్, నిర్మలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేటీఆర్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.