తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా చేయడంలో.. అన్న మాటలను అనలేదని చెప్పడంలో కాంగ్రెస్ నేతలను మించినవారు మరొకరులేరు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి 3 గంటల కరెంటు, 10 హెచ్‌పీ మోటర్లు,రైతు భరోసా, ఫాక్స్‌కాన్ తరలింపు, రైతుబంధుకు మోకాలడ్డు, ఉద్యోగ హామీ వంటి అంశాలపై కాంగ్రెస్ నాయకులు మాటమార్చడమే ఇందుకు ఉదాహరణలు.
– స్పెషల్ టాస్క్ బ్యూరో
రైతుబంధు
రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి
-ఈసీకి రేవంత్ రెడ్డి లేఖ (26.11.2023)
ఆ లేఖ నేను రాయలేదు. అది నకిలీది
– రేవంత్ రెడ్డి (26.11.2023)
ఉద్యోగాల హామీ
కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం
-కాంగ్రెస్ మ్యానిఫెస్టో (03.05.2023)
ఐదేండ్ల సమయం ఉందిగా.. అప్పుడు చూద్దాం
-కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (26.11.2023)
ఫాక్స్‌కాన్
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మీ ఫాక్స్‌కాన్‌ను తరలించండి
– ఫాక్స్‌కాన్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేఖ (4.11.2023)
అది నకిలీ లెటర్. దీనిపై సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా
– డీకే శివకుమార్ (4.11.2023)
10 హెచ్‌పీ మోటర్లు
బావులు, బోర్లకు 10 హెచ్‌పీ మోటర్లు బిగించుకోవాలి. మూడు గంటల్లో పొలం పారుతుంది .
– రేవంత్ రెడ్డి (14.11.2023)
టెక్నికల్‌గా నేను అలా అన్లేదు. అసలు ఉచిత కరెంటు పేటెంట్ రైటే కాంగ్రెస్‌ది.
– రేవంత్ రెడ్డి (27.11.2023)
3 గంటల కరెంటు
రైతులకు మూడు గంటల కరెంటు చాలు. 24 గంటల ఉచిత కరెంట్ అనవసరం
– రేవంత్ రెడ్డి (11.07.2023)
3 గంటలు చాలని నేనన్నట్టు సీఎం కేసీఆర్ చెప్తుండు. నేను అలా అన్లేదు
– రేవంత్ రెడ్డి (27.11.2023)
రైతు భరోసా
రైతు భరోసా సాయం యజమాని, కౌలుదారుల్లో ఎవరో ఒక్కరికే ఇస్తం
– రేవంత్ రెడ్డి (25.11.2023)
నేను అలా అన్లేదు. రైతులు, కౌలుదారులు, రైతు కూలీలందరికీ రైతు భరోసా ఇస్తాం
– రేవంత్ రెడ్డి (26.11.2023)
కరెంటు ఒప్పందం
తెలంగాణలో కాంగ్రెస్ రాగానే టీఎస్ జెన్కోతో ఒప్పందం చేసుకొని కర్ణాటక పరిశ్రమలకు తెలంగాణ కరెంటును సరఫరా చేస్తాం
-కర్ణాటక విద్యుత్తు మంత్రి కేజే జార్జ్ (28.11.2023)
దీన్ని కూడా రేపు అనలేదు అంటారేమో?