Jagadish Reddy | కాంగ్రెస్‌లోని మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారని.. పేమెంట్‌పై పేటెంట్ కాంగ్రెస్‌కే దక్కుతుందని, ఈ విషయం ప్రజలకు తెలుసునని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు గుర్పించారు. తెలంగాణ భవన్లో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జిని ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియా, మీడియా, రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని మండిపడ్డారు. విద్యార్థులు,యువత మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం 1969లో వచ్చాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందని.. సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అంటేనే కేసులు, లాఠీఛార్జిలు మంత్రులు అక్కసు వెళ్లగక్కి విద్యార్థులను అవమానించి పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడారన్నారు.
పెయిడ్ బ్యాచ్ సీఎం, మంత్రులు విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ అయితే కేసులు, లాఠీఛార్జిలు భరిస్తారా ? అంటూ ధ్వజమెత్తారు. పీసీసీ, సీఎం, మంత్రి పదవులు పేమెంట్‌తోనే అవుతున్నాయని ప్రజలకు తెలుసునన్నారు. పేమెంట్ మీద పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. పేమెంట్లతోనే కాంగ్రెస్ నేతలకు పదవులు వచ్చాయని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు పేమెంట్లతో పదవులు పొందారని.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ప్రజల నుంచి వచ్చిన వాళ్లు కాదన్నారు. తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సీహెచ్సీయూ విద్యార్థులకు సైతం అండగా నిలిచారన్నారు. కార్తీ చిదంబరం సైతం పేమెంట్‌తోనే మాట్లాడా? అంటూ ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్, ధ్రువ్ రాఠీ పేమెంట్ తోనే మాట్లాడారా ? అంటూ నిలదీశారు. 2012 సెప్టెంబర్ 16న సీహెచ్‌సీ భూములు ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు ఇస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డం పడుతున్నాయని టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి అన్నారని.. గురువు మొదలుపెట్టిన పేమెంట్‌ను శిష్యుడు రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.