జగిత్యాల, జూలై 12 (నమస్తే తెలంగాణ): 42 శాతం రిజర్వేషన్‌పై రాష్ట్రపతికి బిల్లును పంపిన కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రం లో ఆర్డినెన్స్ డ్రామా ఆడుతూ బీసీలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కొప్పుల మాట్లాడారు. బీసీలకు 42శాతం కోటా అమలు కోసం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఆర్డినెన్సే పరిషారమని భావించినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్టు? రాష్ట్రపతికి ఎందుకు పంపినట్టు? అని ప్రశ్నించారు. సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ కొత్త నాటకానికి తెరలేపిందని ధ్వజమెత్తారు. యూరియా కొరత వల్ల రైతుల అవస్థలు పడుతున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో రాష్ట్రంలో యూరియా కొరత విలయతాండవం చేస్తున్నదని మండిపడ్డారు.
గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సం బంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలం టూ ఏడాదిన్నరగా తాజా మాజీ సర్పంచులు ఆందోళనలు చేస్తున్నారని, వారికి ఇంకె ప్పుడు బిల్లులు మంజూరు చేస్తారని కొప్పుల ప్రశ్నించారు. మైనర్ పంచాయ తీ ల్లో రూ.6 లక్షల వరకు, మేజర్ జీపీల్లో రూ.40లక్షల వరకు బిల్లుల బకాయిలు ఉన్నట్టు తెలి పా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్య క్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, నాయకుడు లోక బాపురెడ్డి, హరిచరణ్ పాల్గొన్నారు.