చిక్కడపల్లి, మే 23: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బాగ్లింగంపల్లిలోని కార్యాలయంలో బీసీ రాజ్యాధికారం సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ.. కులగణన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల వ్యతిరేక తప్పదని హెచ్చరించారు. బహుజన సామాజిక వేత్త వీజీఆర్ నారగోని మాట్లాడుతూ రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ ఓబీసీ నాయకురాలు భాగ్యలక్ష్మి, జస్టిస్ పార్టీ నాయకుడు చిన్నశ్రీకాంత్, ఎంబీసీ నాయకులు మీనాగోపి, వెంకటేశ్ గౌడ్, మారేపల్లి లక్ష్మణ్, అడ్వకేట్ వంశీకృష్ణ, వెంకటస్వామి , యాదగిరి, నరేందర్, పద్మావతి, స్వప్న, దుర్గేశ్ పాల్గొన్నారు.