హైదరాబాద్ : గతంలో తెలంగాణ(Telangana)రాష్ట్రంలోని నియోజకవర్గ కేంద్రాలలో క్యాంపు కార్యాలయాలు(Camp offices) ఉండేవి కావు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR )క్యాంపు కార్యాలయాలు నిర్మించారని దీంతో ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుందని మహబూబ్నగర్ ఎమ్మల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి( MLA Yennam Srinivas Reddy) అన్నారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ఈ క్యాంపు కార్యాలయం ఉంటుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నిన్ననే ఆరు హామీల్లో రెండు హామీలను అమలు చేసిందన్నారు. మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సైతం అమలు చేస్తామన్నారు. ఈ క్యాంపు కార్యాలయం ఈ క్షణం నుంచే ప్రజా సమస్యల పరిష్కారం క్షేత్రంగా ఆవిష్కృతం కానుందని, క్యాంపు కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.