హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ రామ్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు. బుధవారం 22ఏపై చర్చ సందర్భంగా ఆయన శాసనసభలో మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..! అంటూ సంబోధించారు.
ఆ వెంటనే సవరించుకుని సీఎం రేవంత్ రెడ్డి అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. క్షణాల్లోనే రామ్మోహన్రెడ్డి మాట్లాడిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. సీఎం పేరును సొంత పార్టీ ఎమ్మెల్యే మర్చిపోవడం ఏంటి? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.