నాగర్‌కర్నూల్, జనవరి 21 : కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు వస్తాయని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తెలకపల్లి మండలంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ ప్రసంగం వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
వీటిని విన్న ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పిన వారికే పథకాలు వస్తాయంటూ తాను స్వయంగా టిక్కు కొట్టిన వారికే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు వస్తాయని చెప్పడం చూస్తే ప్రజాపాలన తీరును ఎమ్మెల్యేనే బట్టబయలు చేసినట్టయింది.