చౌటుప్పల్/సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 7: ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఎలాంటి పోరాటానికైనా తాను సిద్ధమేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెగేసిచెప్పారు. ‘ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తరభాగం మారాలి.. ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమో!’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణఫురంలో ఆదివారం ఆయన ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు.
‘నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవం.. ఆలస్యమైనా పర్వాలేదు.. నాకు అన్యాయం జరిగినా మంచిదే.. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఎంత దూరమైనా వెళ్తా’ అని స్పష్టంచేశారు. అవసరమైతే ట్రిపుల్ ఆర్ రద్దయినా మునుగోడు ప్రజలకు అన్యాయం జరగనివ్వనని భరోసానిచ్చారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని స్పష్టంచేశా రు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినా అవసరమైతే ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పా రు.
‘నేనేదో లాలూచీ పడి సీఎం దగ్గరికి వెళ్లి నాకేదో పదవి ఇస్తే సప్పుడు చెయ్యక కూ ర్చుంటా అనుకోవద్దు.. మా రైతులకు అన్యా యం చేస్తామంటే నీ పదవి వద్దు.. నీ పైసలొ ద్దు.. ప్రజలే నా బలం.. నా బలగం.. వారి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధం’ అని ప్రకటించారు. భూములు కోల్పోతున్న బాధిత రైతులు తొక్కని గడపలేదని, బీజేపీ నాయకు లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా నితిన్ గడ్కరీ, నడ్డా సహ ఢిల్లీలో పెద్దలందర్నీ కలిసినా వారికి న్యాయం జరగలేదని వాపోయారు.
ట్రిపుల్ ఆర్లో మునుగోడు రైతులే అత్యధిక భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓఆర్ఆర్ నుంచి ట్రి పుల్ ఆర్కు అన్నిచోట్లా సమానమైన పొడవు ఉండాలని, కానీ మునుగోడు నియోజకవర్గానికి వచ్చే సరికి పొడవు తగ్గిందని చెప్పారు. ఇక్కడ భూనిర్వాసితుల సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తానని, కేంద్ర మంత్రి గడ్కరీతో కూడా మాట్లాడుతానని తెలిపారు.