Congress Govt | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వరల్డ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కావాలని వరల్డ్ బ్యాంక్‌కు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు లేఖ రాశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందని, ప్రకృతి విపత్తు పరిహారం కింద రూ.100 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు డిమాండ్ చేశారు. సొంత ప్రభుత్వం మీద నమ్మకం లేక ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంక్‌కు లేఖ రాశాడా అని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది కూడా సొంత ప్రభుత్వంపై ఒక రకమైన తిరుగుబాటులా ఉందంటూ నెటిజన్ల కామెంట్స్ చేస్తున్నారు.
కొసమెరుపు ఏమిటంటే వరల్డ్ బ్యాంక్ ప్రభుత్వాల నుండి వినతులు తీసుకుంటుందే తప్ప ఇలా ప్రజా ప్రతినిధుల నుండి వినతులు తీసుకోదు. విదేశాల్లో చదువుకున్నా అని బిల్డప్ ఇచ్చే సదరు ఎమ్మెల్యేకు కనీసం ఈమాత్రం అవగాహన లేకపోవడం విడ్డూరం అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Revanth Madammohanlal1
Revanth Madammohanlal2