Jupally Krishna Rao | హైదరాబాద్ : తన సొంత ప్రభుత్వంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. అందుకే హామీలు ఇవ్వదలుచుకోలేదని జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జూపల్లి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నేను గెలుస్తనో లేదో నాకే తెల్వదు. పోని నేను గెలిసిన మా పార్టీ గెలుస్తదో గెలవదో తెలియదు.. పోని మా ప్రభుత్వం వస్తదో రాదో తెలియదు.. పోని మా ప్రభుత్వం వచ్చిన ఈ స్కీమ్స్ ఇస్తదో లేదో తెల్వదు. నా జేబుల నుంచి ఇచ్చేటివి ఏమైనా ఉంటే ఇస్తా అని చెప్తా. మరి ఎవరో వచ్చేదానికి.. ఏమైతదో తెలవని దానికి అది మోసపు మాట అయితది కాబట్టి హామీ ఇవ్వను. ఇప్పుడు కూడా మీరు అడిగిన వాటన్నింటికి ప్రయత్నం చేస్తా అని చెప్తున్నాను. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్
చేతులెత్తేసిన జూపల్లి!
వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో..? లేదో..? తెలియదు.. నేను మళ్లీ గెలుస్తానో..? లేదో తెలియదు!
ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా… pic.twitter.com/h2eANDSOZp
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2025