చేర్యాల/మద్దూరు(ధూళిమిట్ట) : జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామమైన నర్సాయపల్లికి చెందిన ముఖ్య నాయకులు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. మద్దూరు మండలం నర్సాయపల్లి, చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వారి అనుచరులతో సోమవారం రాత్రి బీఆర్ఎస్లో చేరారు. ఏఎంసీ మాజీ డైరెక్టర్, మాజీ ఉపసర్పంచ్ శనిగరం సత్యనారాయణ, మాజీ వార్డు సభ్యులు తలారి కనకయ్య, సంతోష్‌రెడ్డి, ముస్త్యాల శ్రీహరి, రాజు, ఆకునూరు చెందిన మంతపురి సత్యనారాయణ, వారి అనుచరులు బీఆర్ఎస్లో చేరగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ..జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధ్దంగా ఉన్నారని తెలిపారు. తాము గేట్లు ఎత్తితే ఇక కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఉండరని చెప్పారు.