ఇల్లు కట్టాలంటే సగం భూమి ఇవ్వాల్సిందే
ఆ జాగాలో ఇల్లు కట్టుకోవాలంటే సగం భూమి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఓ కుటుంబాన్ని బెదిరిస్తున్న ఘటన ములుగు మండలం బండారుపల్లిలో జరిగింది.
- కాంగ్రెస్ నాయకుల బెదిరింపు
ములుగు, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఆ జాగాలో ఇల్లు కట్టుకోవాలంటే సగం భూమి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఓ కుటుంబాన్ని బెదిరిస్తున్న ఘటన ములుగు మండలం బండారుపల్లిలో జరిగింది. బాధిత దంపతులు బిళ్ల పోశాలు-స్వరూప మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోశాలు మాట్లాడుతూ, 1993లో అప్పటి ప్రభుత్వం తన తండ్రికి బండారుపల్లి శివారులో రెండు గుంటల భూమిని ఇంటి కోసం ఇచ్చిందని తెలిపాడు.
ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తుండగా మాజీ ఉపసర్పం చ్, కాంగ్రెస్ నాయకులు లక్ష అడిగారని ఆరోపించాడు. ఇవ్వకపోవడంతో ఈ భూమి ప్రభుత్వానిదని బెదిరిస్తూ గుం ట భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చి దాడికి యత్నించారని, తాను రాళ్లు విసరడంతో పారిపోయార ని తెలిపాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.మాజీ ఉపసర్పంచ్ను వివరణ కోరగా..పోశాలు ప్రభుత్వ భూమిలో ఇల్లు కడుతుండగా.. అది తనదని మరో వ్యక్తి వచ్చాడని చెప్పారు. వారిద్దరూ గొడవపడి ఒకరిపైఒకరు ఫిర్యాదు చేసుకుంటూ తమపై ఆరోపణ లు చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

