Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Ramayana | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించినట్లు సమాచారం.
Ramayana | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రూ.375.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. భారీ తారాగణం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, రామాయణ గాథను సరికొత్త కోణంలో ఆవిష్కరించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు సెలవులు రావడంతో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘రామాయణ’ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.375.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియాలోనే భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టగా, విదేశీ మార్కెట్లలో కూడా మంచి ప్రదర్శన కనబరిచినట్లు తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే ఇండియాలో సుమారు రూ.69.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు అంచనా. దీపావళి పండుగ ఆదివారం రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, దీంతో వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగవచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా తొలి మూడు రోజుల వసూళ్ల వివరాలు చూస్తే.. వరల్డ్ వైడ్ గ్రాస్: రూ.375.50 కోట్లు, ఇండియా గ్రాస్: రూ.218.25 కోట్లు, ఇండియా నెట్: రూ.182.70 కోట్లు, ఓవర్సీస్ గ్రాస్: రూ.157.25 కోట్లు. ఈ వసూళ్లతో ‘రామాయణ’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ సాధించిన చిత్రాల జాబితాలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించడం, భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. దాదాపు రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. నమిత్ మల్హోత్రా, నటుడు యశ్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ సినిమా కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసారు. రెండో భాగాన్ని 2028లో విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

