Suryapet | సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఉప్పుల మల్లయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు
బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన ఈ దాడితో లింగంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ దాడిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారనికి.. గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పినా పోలీసులు పెడచెవిన పెట్టారని ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే బీఆర్ఎస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడని, ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.