వనపర్తి, ఆగస్టు 3 : వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సాగునీటి రాకతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పెద్దమందడి మండలం మోజర్ల సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో 30 మంది కాంగ్రెస్ నాయకులు గురువారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో ఎండాకాలంలోనే నీటితో తొణికిసలాడుతున్నాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, గ్రామ అధ్యక్షుడు సతీశ్, యువజన అధ్యక్షుడు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.