నిజామాబాద్ ( ఎర్గట్ల ) : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Vemula Prashanth Reddy ) ఆధ్వర్యంలో జిల్లాలోని ఎర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు( Congress Leaders ) బీఆర్ఎస్( BRS ) పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నపు అంజయ్య, జిట్టావోయినా రాజు, నాయుడు పోశెట్టికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో చేరిన నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా వాటిని సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు, బోనస్ వంటి హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం, పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజా పూర్ణనందం, ఎర్గట్ల సర్పంచ్ ఉపేందర్, మాజీ జడ్పీటీసీ గుళ్ళే రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ మధు, పార్టీ అధ్యక్షులు దేవుని నర్సయ్య, సొసైటీ చైర్మన్ బర్మా నర్సయ్య, ప్రభాకర్,కుశ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.