గోదావరిఖని, అక్టోబర్ 15: వాస్తవాలను బయటపెడుతున్న పత్రికపై కాంగ్రెస్ నేతలు అక్కసు వెళ్లగక్కారు. పత్రికా స్వేచ్ఛకే సమాధి కట్టారు. నిజానిజాలపై ప్రజలకు సమాధానం చెప్పకుండా.. ఏకంగా పత్రికలనే దహనం చేసే కొత్త సంస్కృతికి తెరలేపారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులను దహనం చేయడంపై అటు జర్నలిస్టులు, ఇటు మేధావులు మండిపడుతున్నారు. వాస్తవం ఏంటంటే.. ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 15న ‘అభివృద్ధి పనుల జాడేది?’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. గోదావరిఖని కల్యాణ్నగర్లో గత ఆగస్టులో మంత్రి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ మాత్రం పనులు చేపట్టకపోవడంతో అక్కడి వ్యాపారులు నిత్యం దుమ్మూ ధూళితో నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే కోణంలో వ్యాపారుల అభిప్రాయాలను ఉటంకిస్తూ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధ్యతగా ప్రజలకు సమాధానం చెప్పకపోగా.. పత్రికా ప్రతులనే గోదావరిఖనిలో దహనం చేసి సమాజానికి ఏం సంకేతం ఇచ్చారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలిపై అటు జర్నలిస్టులు, ఇటు మేధావులతోపాటు ఆ పార్టీలోని నాయకులు, కార్యక్తలు కూడా విస్మయం వ్యక్తంచేశారు. వ్యాపారుల విజ్ఞప్తి మేరకే దసరా పండుగ వరకు పనులను తాత్కాలికంగా నిలిపివేశారంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్తూనే మరోవైపు నిరసన చేపట్టడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే రామగుండానికి రూ.400 కోట్ల నిధులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. నిజానికి ఆ కథనంలో స్థానిక ఎమ్మెల్యే గురించి ఎలాంటి విమర్శలు కూడా లేవు. కానీ.. కాంగ్రెస్ నాయకులు మాత్రం ‘గుమ్మడికాయ దొంగ’ చందంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు బాహటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈరోజు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన వార్తలో ముమ్మాటికీ వాస్తవికత ఉన్నది. అకడి వ్యాపారులు చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. వ్యాపారుల అభిప్రాయాలకు సమాధానం చెప్పకుండా.. పత్రికను దహనం చేయడం ఏంటి? ఇదెకడి సంస్కృతి? జర్నలిస్టులను అవమానపరచడమే. ప్రశ్నించే గొంతుకలను నొకాలని చూస్తే మేం చూస్తూ ఊరుకోం.
ప్రశినంచే గొంతుకలను నొకుతారా? ఈ సంస్కృతి ఎకడైనా ఉన్నదా? వాస్తవాలను ప్రచురించిన పత్రికను తగలబెట్టి మీరు సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నారు? నిజానికి ఆ వార్త ఒకటి.. మీ ఆరోపణ మరొకటి. రామగుండానికి రూ.400 కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నారు. వాటి మీద శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ తొమ్మిది నెలల కాలంలో ఎకడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఒకసారి చూపించండి. అసలు పేపర్లో వచ్చిన వార్తను కనీసం గమనించారా? ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి.. పత్రికలను దహనం చేయడం ఏంటి? రేపు ఇంకో పత్రికలో వార్త వస్తది తగలబెడతారా? ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లే.