యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23 : యాదగిరిగుట్ట దివ్య విమానగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హంగామా చేశారు. విమాన గోపురంపైకి సీఎం రేవంత్రెడ్డి వెళ్లగా.. ఆయనతో వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు సీఎం సెక్యూరిటీ సిబ్బంది అనుమతిని నిరాకరించారు.
పైకి వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పవిత్రంగా స్వామివారు విహరించే తిరుమాడ వీధుల్లో చెప్పులతోనే సంచరించారు. పలువురు చెప్పు లు వేసుకునే ఆలయంలోకి ప్రవేశించారు.