రామగిరి, జూన్ 2 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో సోమవారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో పార్టీ అధినేత సోనియాగాంధీ చిత్రపటానికి దండవేసి వందనం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలకు కనీస అవగాహన లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం బెడిసికొట్టడం మండలంలో చర్చనీయాంశమైంది.