హైదరాబాద్, మే 27 (నమసే ్తతెలంగాణ): గాంధీభవన్‌లో మంత్రుల ఎదుటే ఇద్దరు కాంగ్రెస్ నేతలు చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. గాంధీభవన్‌లో బుధవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయమై కార్వాన్ కాంగ్రెస్ ఇన్చార్జి ఉస్మాన్ అల్ హాజ్రీ, నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఫిరోజ్‌ఖాన్ మధ్య గొడవ మొదలైంది.
మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ఎదుటే ఇద్దరూ చొక్కాలు పట్టుకొని కొట్టుకొన్నారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావును సైతం తోసేందుకు ప్రయత్నించగా మిగతా నేతలు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అజారుద్దీన్ కోపంతో అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తమది కాంగ్రెస్ ఫ్యామిలీ అని, ఫ్యామిలీలో గొడవలు సహజమని ఉస్మాన్, ఫిరోజ్‌ఖాన్ అన్నారు.