Koheda Congress Leader | రైతులకు న్యాయం చేయమని అడిగితే.. కాంగ్రెస్ నాయకులను సైతం అరెస్టు చేయించిన రేవంత్ సర్కార్!
Koheda Congress Leader | ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని వారికి మద్దుతుగా నిలిచిన కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అరెస్టు చేయించారు.
Koheda Congress Leader | తుర్కయంజాల్, జూన్ 6: ప్రజా ప్రభుత్వంలో రైతుల పక్షాన నిలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు సైతం అరెస్టులు తప్పడంలేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని వారికి మద్దుతుగా నిలిచిన కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితో స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అరెస్టు చేయించారు.
కోహెడ పండ్ల మార్కెట్ భూములు ఇచ్చిన రైతులు తమకు న్యాయం చేయాలని కొంతకాలంగా ఆందోళన చేపట్టారు. కోహెడ మాజీ కౌన్సిలర్లు కంబాలపల్లి ధనరాజ్, బండారు బాలరాజ్‌లు ఈ ఆందోళనలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. శనివారం కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్‌కు శంకస్థాపన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారు సెల్ఫీ వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
congress leaders arrested for support koheda fruit maket victim farmers protest
రైతులకు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్ నాయకులమని కూడా చూడకుండా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి తమను అరెస్టు చేయించారని వారు ఆ వీడియోలో ఆరోపించారు. రైతుల హక్కుల కోసం, భూ బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ శాంతియుతంగా మద్దతు తెలుపుతుంటే అరెస్టులకు పాల్పడటం దురదృష్టకరమని విమర్శించారు. కోహెడలో భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు, వారిని ఆదుకోవాల్సిందిపోయి ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేయడ సరైనది కాదని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడ్డ వారిని భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలను ఎదుర్కొంటామని అన్నారు. భూ బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

