నర్సింహులపేట, జూన్ 7: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న బేరగాళ్ల వడ్లు మాత్రమే కొనుగోలు కేంద్రం వద్ద కాంటా పెడుతున్నారని, రైతుల వడ్లు మాత్రం కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, రైతులు నిరసన వ్యక్తంచేశారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వస్రంతం డా కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం కాంగ్రెస్ నాయకుడు చెలమల్ల నరేశ్ పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఇదే కొనుగోలు కేంద్రా న్ని సందర్శించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని హెచ్చరించినా నిర్వాహకుల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు. దళారుల వడ్లు లారీలో వేసిన వాటిని కిందికి దింపి రైతుల ధా న్యం తరలించాలని డిమాండ్ చేశారు.