నారాయణపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలు (Congress leader) కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నానా హంగామా చేస్తుండడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన పథకాల గురించి నిలదీస్తున్న గ్రామస్థులపై విరుచుకుపడుతున్నారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి మేనమామ, కాంగ్రెస్ డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి (Kumbam Shivakumar Reddy) గ్రామస్థులపై సీరియస్ అయ్యారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారిన మమ్మల్ని వాడుకొని పట్టించుకోవట్లేదు అంటూ కుంభం శివకుమార్ రెడ్డిని కాంగ్రెస్ రెబల్ వర్గం నిలదీసింది. దీంతోవారిపై చీరి పారేస్తా నా కొడక అంటూ కుంభం శివకుమార్ రెడ్డి రెచ్చిపోయారు.