ఆలేరు టౌన్ , జూన్ 15: ‘నీ సంగతి చెప్త…ఒళ్లు పగుల్తది..’ అంటూ ఓ కాంగ్రెస్ నేత పోలీసులను బెదిరించిన ఘటన సోమవారం వైరల్గా మారింది. ఆలేరు మండలంలో ఆదివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్.. యాదాద్రి జిల్లా ఆలేరు పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను బెదిరించాడు.
‘నువ్వెట్ల బండి ఆపుతవ్.. నీ సంగతి చెప్తా ! పోలీస్స్టేషన్ నా జాగీర్.. నువ్వెవరు ఆపేందుకు?’ అంటూ చిందులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.