హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): జీఎస్టీ ఎగవేత కేసులో అరెస్టయిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ ని యోజకవర్గ ఇన్చార్జి, ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి బుధవారం విడుదలయ్యారు. రూ.5 లక్షల సొంత పూచీకత్తుతోపాటు ఇద్దరి జమానత్తో నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించకుండా ఎగవేసిన కేసులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ అధికారులు సునీల్‌కుమార్‌ను మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్‌ను కూడా అరెస్టు చేశారు. అధికారులు వీరిద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఇరుపక్షాల వా దనల అనంతరం న్యాయమూర్తి.. నిం దితులు ఇద్దరికి బెయిల్ మంజూరు చేశారు.