హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ): అధిష్ఠానం అవకాశం ఇస్తే నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి చెప్పారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో తన పోటీపై చర్చించినట్టు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 16 సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. రాజీవ్‌గాంధీ హయాంలోనే రామాలయ నిర్మాణానికి పునాది వేశామని, కోర్టు కేసులతో అది నిలిచిపోయిందని గుర్తుచేశారు. తమ పార్టీ డీఎన్ఏలోనే రాముని సందేశం ఉన్నదని అన్నారు.