హైదరాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కోట్ల సాయిబాబా బీఆర్ఎస్లో చేరారు. కల్వకుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సాయిబాబా ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లండన్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నారై యూకే కార్యవర్గ సమావేశంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ తాను యూకే వచ్చిన తర్వాత ఎక్కడికెళ్లినా తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ చేసిన పదేండ్ల ప్రగతిపైనే మాట్లాడుతున్నారని తెలిపారు.
తెలంగాణ ప్రజలకు మేలు జరగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్లో చేరినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అశోక్ గౌడ్, నవీన్‌రెడ్డి, రత్నాకర్ కడుదుల, చంద్రశేఖర్ గౌడ్, గణేశ్ కుప్పల, శ్రవణ్‌రెడ్డి, రవి ప్రదీప్, శ్రీధర్‌రావు, ప్రవీణ్, సురేశ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.