Azam Jahi Mills | వరంగల్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల పెత్తనం బాగా పెరిగిపోతున్నది. అధికారులు కాంగ్రెస్ నేతలకు అన్ని రకాలుగా సాగిలాపడినట్టు కన్పిస్తున్నది. వరంగల్‌లోని అజంజాహి మిల్లు కార్మిక భవన్ భూమి కబ్జా వ్యవహారంలో మంత్రి సురేఖ భర్త కొం డా మురళీధర్‌రావు వివరణ ఇచ్చేందుకు గురువారం ఇక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత కొండా మురళి ప క్కనే కూర్చుని ఆయన అడిగిన వాటిని సమాధానమిచ్చారు. కొండా మురళికి వచ్చిన సందేహాల గురించి ఆయన చెవిలో చెప్తూ ఉన్నారు.
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స మాధానం చెప్పాలని కొన్నిసార్లు తహసీల్దార్‌కు కొండా మురళి సూచించారు. భూకబ్జా వ్యవహారంపై విచారణ నిర్వహించే హోదాలో ఉన్న తహసీల్దార్ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి కొండా సురేఖ సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పు సెగ్మెంట్లో ఇప్పటికే పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు సైతం ఇంత కంటే ఎక్కువగా అధికార పార్టీ నేతలకు విధేయులుగా ఉంటున్నారు.
అజంజాహి మిల్లు కార్మికుల యూనియన్ భవనం పేద కార్మికులకే చెందే విధంగా చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు తెలిపారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాం పు ఆఫీసులో మురళీధర్‌రావు గురువారం మీడియాతో మాట్లాడారు. మిల్లు భూముల జోలికి వెళ్లిన వారంతా నష్టపోతారని చెప్పా రు. ప్రైవేటు కాంప్లెక్స్ నిర్మాణ పనులను నిలిపివేయాలని వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్‌ను ఆదేశించినట్టు తెలిపారు.
కార్మికుల ఆ కాంక్షలకు అనుగుణంగా అదే స్థలంలో కార్మి క కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తాన ని తెలిపారు. 40 ఏండ్ల రాజకీయ జీవితం లో భూములు కబ్జాలకు పాల్పడలేదని చె ప్పారు. కాసం ఓం నమశివాయ అనే వ్యక్తి షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానిస్తే శంకుస్థాపనకు వెళ్లానని వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటానని పేర్కొన్నారు. ఆ భూ మిపై పూర్తి స్థాయిలో సర్వే చేయించి, కార్మికులకు ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని చెప్పారు. అ వసరమైతే కార్మికులకు స్థలం కొనుగోలు చేసి భవనం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.
అజంజాహి మిల్లు కార్మిక భవన్ కబ్జా వ్యవహారంలో అధికారులు ఎట్టకేలకు చర్య లు మొదలుపెట్టారు. మంత్రి భర్త, మా జీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు అండదండలతో ఓ ప్రైవేట్ వ్యాపా రి అజంజాహి మిల్లు కా ర్మిక భవన్ కబ్జా కోసం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘అజంజాహి కార్మిక భవన్ కబ్జా’.. ‘కబ్జాపై మౌ నం’ శీర్షికలతో వచ్చిన కథనాలపై అధికారులు స్పందించారు. వరంల్ కలెక్టర్ సత్యశారద ఆదేశాలతో వరంగల్ తహసీల్దార్ ఎండీ ఇక్బాల్ గురువారం కార్మిక భవన్ స్థలాన్ని పరిశీలించారు.
తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశా లు జారీచేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కే సు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 75 ఏండ్లుగా కార్మికుల కోసం ఉన్న భవనం కబ్జాపై తహసీల్దార్ ఆదేశాలతో తా త్కాలికంగా అడ్డుకట్ట పడింది. కా ర్మిక భవనాన్ని కూల్చి వేసి అక్కడ ఓ వ్యాపారితో కలిసి కొండా ము రళీధర్‌రావు ప్రైవేట్ కాంప్లెక్స్ ని ర్మాణం కోసం సోమవారం భూమి పూజ చేశారు. మిల్లు స్థలంలోని కూల్చివేతలు, కొత్త నిర్మాణాలపై బీఆర్ఎస్, సీపీ ఎం, ఎంసీపీఐ, సీపీఐ(ఎంఎల్), బీజేపీ ని రసన తెలిపింది. వరంగల్ కలెక్టర్, రెవె న్యూ, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.