హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సోమాజిగౌడ ప్రెస్‌క్లబ్‌ను కల్లు కాంపౌండ్‌తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జగ్గారెడ్డి మరో వీడియో విడుదలచేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేటీఆర్ పదేండ్లు మంత్రిగా చేశారు.. చర్చ అసెంబ్లీలో చేయాలా?
కల్లు కాంపౌండ్లోనా’? అంటే ఎట్లా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. సీఎం కోసం ప్రత్యేకంగా కుర్చీవేసి ఎదురుచూసినా రాలేదు. ఈ అంశంపై జగ్గారెడ్డి ప్రెస్‌క్లబ్‌ను కల్లు కాంపౌండ్‌తో పోల్చుతూ నోరు పారేసుకున్నారు.