మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 26: మానుకోట కాంగ్రెస్ టికెట్ బెల్లయ్య నాయక్‌కు ఇవ్వకపోతే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఓడిస్తామని లంబాడా హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ భీమానాయక్ హెచ్చరించారు.
గురువారం మహబూబాబాద్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భీమానాయక్ మాట్లాడుతూ 30 ఏండ్లుగా ప్రజల మధ్య ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు బెల్లయ్య నాయక్‌కు టికెట్ రాకుండా అడ్డుపడుతున్న వారిని తప్పకుండా ఓడిస్తామని స్పష్టం చేశారు. వెయ్యి రూపాయలిస్తే, గుడుంబా పోస్తే లంబాడాలు ఓటు వేస్తారని రేవంత్‌రెడ్డి కించపరిచినట్టు మాట్లాడటంపై ఆయన మండిపడ్డారు. దాదాపు 20 స్థానాల్లో లంబాడాలతో పోటీ చేయించి కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని ఆయన హెచ్చరించారు.