నవాబ్‌పేట, జూన్ 9 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కిషన్‌గూడ గ్రామ పంచాయతీ మదిర గుబ్బడిగుచ్చతండాకు చెందిన డిగ్రీ చదువుతున్న 19 ఏండ్ల యువతిపై అదే తండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు లైంగికదాడికి పాల్పడినట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. గుమ్మడిగుచ్చతండాకు చెందిన ప్రేమ్‌కుమార్‌నాయక్ 15 రోజుల కిందట సదరు యువతి ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
అప్పటినుంచి ప్రతి రోజూ లైంగికంగా వేధించడంతో సోమవారం బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ప్రేమ్‌కుమార్‌నాయక్ కొన్నేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేస్తున్నాడని, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టు తెలిసింది.