Makthal | మక్తల్, అక్టోబర్ 29: అమ్మ ఆదర్శ కమిటీలో ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను డ్రా చేసేందుకు తీర్మానం ఇస్తావా? లేదా? ఇవ్వకపోతే కమిటీ అధ్యక్షురాలిగా తొలగించేందుకు వెనకాడనని కాంగ్రెస్ నాయకుడు అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థులకు వా ష్రూంలు లేకపోవడంతో కేసీఆర్ సర్కారు హయాంలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతన్గోడ్ జడ్పీ ఉన్నత, మండ ల ప్రాథమిక పాఠశాలకు రూ.7.50 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. కాగా.. జడ్పీ ఉన్నత పాఠశాలలో అదే గ్రామానికి చెం దిన కాంగ్రెస్ నేత పాల కృష్ణయ్య వాష్రూంలను నిర్మించి రూ.5 లక్షలను మంజూరు చే యించుకున్నారు. బిల్లులు రాకపోవడంతో వాటిని అసంపూర్తిగానే వదిలేశారు. కాంగ్రెస్ స ర్కారు ఏర్పడిన త ర్వాత పెండింగ్ ప నులు పూర్తి చేయాలని పాఠశాలలకు 3లక్షల చొప్పున ని ధులు విడుదల చేశా రు. జడ్పీ ఉన్నత పాఠశాలలో మిగిలిన పనుల కోసం కాంగ్రెస్ నాయకుడు ముందస్తుగానే రూ.1.50లక్షలు కమిటీ అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నాడు. మిగిలిన పనులను అసంపూర్తిగా చేపట్టి రూ.1.50 లక్షలను డ్రా చేసేందుకు కమిటీ అధ్యక్షురాలు ఫాతిమా బేగంపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఆమె కలెక్టర్కు ఫిర్యా దు చేశారు. ప్రాథమిక పాఠశాల కమిటీ అధ్యక్షురాలు చిట్టెమ్మను సైతం తీర్మానం కోసం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రజలు చెప్తున్నారు.
లచ్చిరెడ్డికి ఏమైంది?.. కొత్తగా పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం
ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి మ రోసారి చర్చనీయాంశం అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రా గానే ఆయనకు రెవెన్యూ శాఖలో కీలకమైన పోస్టు కట్టబెట్టింది. ధరణి ప్రాజె క్టు డైరెక్టర్గా నియమించింది. ఇటు ధరణి కమిటీ సమావేశాలకు, కొత్త ఆ ర్వోఆర్ చట్టం రూపకల్పనలో భాగస్వాములు కావడం ద్వారా, అటు డిప్యూ టీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడిగా ఉద్యో గ సంఘాల్లో హల్చల్ చేశారు. సోమవారం పరిస్థితి తారుమారైంది. ప్రభు త్వం ఐఏఎస్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రెడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఇందులో సీఎంఆర్వో ప్రాజె క్టు డైరెక్టర్ పదవిని మంద మకరందు కు అప్పగించింది. లచ్చిరెడ్డికి మాత్రం కొత్తగా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.