bombs found in Bengal | బెంగాల్లో భారీ సంఖ్యలో బాంబులు గుర్తింపు.. స్థానికుల్లో భయాందోళన
bombs found in Bengal | పశ్చిమ బెంగాల్లో భారీ సంఖ్యలో నాటు బాంబులను స్థానికులు గుర్తించారు. ఒక తోటలో 31 బాంబులు పేర్చి ఉండటం చూసి భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో భారీ సంఖ్యలో నాటు బాంబులను స్థానికులు గుర్తించారు. ఒక తోటలో 31 బాంబులు పేర్చి ఉండటం చూసి భయాందోళన చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. (bombs found in Bengal) బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం కోట్ గ్రామం చెరువు గట్టు సమీపంలోని వెదురు తోట వద్ద 31 నాటు బాంబులు పేర్చి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యాపించాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీస్ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు. తోటలో పేర్చి ఉంచిన 31 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్వీర్యం చేసేందుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఈ బాంబులను ఎవరు, ఏ ఉద్దేశంతో నిల్వ చేశారో గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో బాంబులు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- area sealed
- Bengal
- Birbhum
- Fear
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

