హైదరాబా ద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని మరోసారి స్పష్టమైందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడి యా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతి కి అసెంబ్లీలో సంతాపం తెలిపి, ఆర్థిక సంసరణలతో దేశాన్ని గాడిలో పెట్టిన పీవీ నరసింహారావు గురించి మాత్రం ప్రభుత్వం మాట్లాడకపోవడం శోచనీయమని మండిపడ్డారు. మాజీ ప్రధానులకు ఢిల్లీలో స్మారకాలు ఉన్నాయ ని, పీవీ నరసింహారావుకు మాత్రమే లేదని కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించి న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటివరకు ఢిల్లీలో పీవీ స్మారకంపై కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. పీవీ కుటుంబసభ్యులకు, తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ప్రపంచంలో భారత్‌ను ఉన్నతమైన ఆర్థికశక్తిగా నిలిపిన ఆర్థిక సంస్కరణల పితామహుడని సెస్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ హనుమంతరావు ప్రశంసించారు. బేగంపేటలోని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో సోమవారం మన్మోహన్సింగ్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హ నుమంతరావు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ, ఆధార్ కార్డు వంటి విప్లవాత్మక చట్టాలను రూపొందించిన ఆర్థిక ప్రగతిశీలి మన్మోహన్సింగ్ అని కొనియాడారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా దేశానికి నిస్వార్థ సేవ చేశారని గుర్తుచేసుకున్నారు. ప్రొఫెసర్ మహేందర్‌రెడ్డి, ఆ ర్థిక శాఖ మాజీ సలహాదారు డాక్టర్ జీ ఆర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ రేవతి పాల్గొన్నారు.