జడ్చర్ల టౌన్, ఆగస్టు 26 : ‘తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది.. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.. భవిష్యత్ అంతా బీఆర్ఎస్దే’ అని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో బాలానగర్ మండలం సూరారం గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం లక్ష్మారెడ్డి మా ట్లాడుతూ.. రేవంత్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కాంగ్రెస్లో విబేధాలతో ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. భవిష్యత్ అంతా గులాబీ పార్టీదే అని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్ను సీఎంగా చేయడమే లక్ష్యంగా క్యాడర్ పనిచేయాలని సూచించారు.