హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండు రోజుల్లో వేతనాలను చెల్లిస్తామని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారని యూనియన్ నేతలు వెల్లడించారు. సొసైటీ పరిధిలోని గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత సంపత్ ఆధ్వర్యంలో శనివారం పలువురు సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ యూనియన్ నేతలు మాట్లాడుతూ.. ఉద్యోగుల డేటా తప్పనిసరిగా ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఉండాలనే లక్ష్యంగా సొసైటీ ముందుకు సాగుతున్నదని, తద్వారా జీతాలివ్వాలని నిర్ణయించారని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆత్మీయ సభను మహబూబ్నగర్లో ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర వరింగ్ అధ్యక్షుడు మహ్మద్ రాజమ్మద్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.